న్యూ ఇయర్- 2026 దుబాయ్‌లో ఉండే వారికి షాక్ ఇవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్ వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగడంతో అక్కడ అద్దెలు ఈ ఏడాది గరిష్ఠంగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటితో పాటు విల్లాలు, ప్లాట్ల రేట్లు కూడా అధికంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దుబాయ్ అంటే కాస్లీ లైఫ్‌కు పెట్టింది పేరు. ఆ నగరం కేవలం టూరిస్ట్ స్పాట్‌గానే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక వైభవం, సైక్యూరిటీ తదితర కారణాల రీత్యా దుబాయ్‌కి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో 2026లో అక్కడి భవనాల అద్దెరెట్లు దాదాపు ఆరుశాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
పామ్ జుమేరా, దుబాయ్ హిల్స్, డౌన్‌టౌన్, దుబాయ్ మెరీనా వంటి ప్రాంతాలలో నివసించడానికి విదేశీయులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని అందుచేత అక్కడ అద్దెలు ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు సాధారణ ప్రాంతాలలో అద్దెలు సైతం గణనీయంగా పెరుగుతుండడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలకు వీటిని చెల్లించడం అధిక భారంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.
వీటితో పాటు గోల్డెన్ వీసా హోల్డర్లు, విదేశీ నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో పాట్లు, విల్లాల అమ్మకాలకు అధిక డిమాండ్ ఏర్పడనున్నట్లు తెలిపారు.


