పరస్పరం మార్చుకున్న భారత్–పాకిస్తాన్
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం మొదటి రోజైన గురువారం భారత్, పాకిస్తాన్‌లు తమ అణు వసతులు, ఖైదీల వివరాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నాయి. 35 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయి. భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ అణు వసతులపై పరస్పరం దాడులకు పాల్పడరాదన్న ఒప్పందం 1988లో కుదిరింది. 1991 జనవరి 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచి్చంది.
దీని ప్రకారం మొదటిసారిగా 1992 జనవరి ఒకటో తేదీన అణు వసతులు వివరాలు మార్చుకున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారికి పాక్, ఢిల్లీలోని పాక్ దౌత్యాధికారికి భారత్ ఈ మేరకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా, వరుసగా 35వ సారి గురువారం ఈ మేరకు వివరాలను అందజేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ ఏడాది మేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే. ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా క్షీణించినప్పటికీ రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించడం విశేషం.
వారికి వెంటనే విముక్తి కల్పించాలి: భారత్
భారత్–పాక్‌లు గురువారం తమ దేశాల్లో ఉంటున్న ఖైదీల జాబితాను మార్పిండి చేసుకున్నాయి. పాక్ జైళ్లలో శిక్షాకాలాన్ని ముగించుకున్న 167 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా భారత్ కోరింది. అదే విధంగా, పాక్ కస్టడీలో ఉన్న 35 పౌర ఖైదీలు, మత్స్యకారులను కాన్సులేట్ అధికారులు కలుసుకునేలా వెసులుబాటు కలి్పంచాలని అడిగింది. ప్రస్తుతం భారత్ జైళ్లలో పాక్ పౌరులు 391 మంది, మత్స్యకారులు 33 మంది ఉండగా, పాక్ జైళ్లలో 58 మంది భారత పౌరులు, 199 మంది మత్స్యకారులు మగ్గుతున్నారు.


