breaking news
India-pakistan relation
-
అణు వసతులు.. ఖైదీల జాబితా
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం మొదటి రోజైన గురువారం భారత్, పాకిస్తాన్‌లు తమ అణు వసతులు, ఖైదీల వివరాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నాయి. 35 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయి. భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ అణు వసతులపై పరస్పరం దాడులకు పాల్పడరాదన్న ఒప్పందం 1988లో కుదిరింది. 1991 జనవరి 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచి్చంది. దీని ప్రకారం మొదటిసారిగా 1992 జనవరి ఒకటో తేదీన అణు వసతులు వివరాలు మార్చుకున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారికి పాక్, ఢిల్లీలోని పాక్ దౌత్యాధికారికి భారత్ ఈ మేరకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా, వరుసగా 35వ సారి గురువారం ఈ మేరకు వివరాలను అందజేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ ఏడాది మేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే. ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా క్షీణించినప్పటికీ రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించడం విశేషం. వారికి వెంటనే విముక్తి కల్పించాలి: భారత్ భారత్–పాక్‌లు గురువారం తమ దేశాల్లో ఉంటున్న ఖైదీల జాబితాను మార్పిండి చేసుకున్నాయి. పాక్ జైళ్లలో శిక్షాకాలాన్ని ముగించుకున్న 167 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా భారత్ కోరింది. అదే విధంగా, పాక్ కస్టడీలో ఉన్న 35 పౌర ఖైదీలు, మత్స్యకారులను కాన్సులేట్ అధికారులు కలుసుకునేలా వెసులుబాటు కలి్పంచాలని అడిగింది. ప్రస్తుతం భారత్ జైళ్లలో పాక్ పౌరులు 391 మంది, మత్స్యకారులు 33 మంది ఉండగా, పాక్ జైళ్లలో 58 మంది భారత పౌరులు, 199 మంది మత్స్యకారులు మగ్గుతున్నారు. -
మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు
కరాచీ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నరేంద్ర మోదీ ప్రధాని పదవిలో ఉన్నంత కాలం భారత్- పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగవంటూ పేర్కొన్నాడు. అంతేకాదు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ' భారత్, పాక్‌ల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే భారతదేశ ప్రధాని మోదీ. ఆయన అధికారంలో ఉన్నంత వరకు భారత్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాదు. అసలు మోదీ ఎజెండా ఏమిటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి ఒకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ మోదీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని సూచిస్తున్నాయి' అంటూ తెలిపాడు. (‘భారత్-పాక్ సిరీస్ యాషెస్ కంటే గొప్పది’) కాగా భారత జట్టు చివరిసారిగా రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో 2006లో పాక్‌లో పర్యటించింది. అయితే 2008లో 26/11 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పటినుంచి టీమిండియా పాక్ గడ్డపై అడుగు పెట్టలేదు. ఐసీసీ వేదికగా జరిగిన టోర్నమెంట్లలో తప్ప భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగలేదు. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరిగితే.. 2013 నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. (ట్రంప్‌పై పీటర్సన్, ఐసీసీ సెటైర్) -
మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ ఫైర్
న్యూఢిల్లీ: కొన్ని కీలక విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పాలనపై సంచలనవ్యాఖ్యలు చేశారు. బీఫ్ వివాదం, దాద్రీ అసహనం వంటి సమస్యలపై మాట్లాడకపోవటంపై ప్రశ్నించారు. ఆయన భారత్ కు మాత్రమే ప్రధాని అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ చురక అంటించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ప్రస్తుతం విశ్వాస సంక్షోభం తలెత్తిందని మాజీ ప్రధాని విమర్శలు చేశారు. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం ఉందన్న భరోసాను ప్రజల్లో కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ వ్యాఖ్యానించారు. ముజఫర్‌నగర్, దాద్రీ, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న మతపరమైన వివాదాలు, బీఫ్ అంశాలపై మోదీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకొచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా మోదీ ప్రభుత్వం ఇంకా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించలేదని, ఇంకెప్పుడు ఈ పని చేస్తారంటూ మాజీ ప్రధాని ఎద్దేవా చేశారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా ధరలు పెరిగిపోతున్నాయని, వారికంటే తమ యూపీఏ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థే మెరుగ్గా ఉండేదంటూ ఆర్థికవేత్త మన్మోహన్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన వల్ల ద్రవ్యోల్బణం తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ప్రధాని తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించడం సంతోషించదగ్గ అంశమే. కానీ, ఆ దేశంతో సంబంధాలను మెరుగు పరుచుకోవడంలో ఇప్పటికీ ముందడుగు పడలేదని ఆరోపించారు. పాక్ తో సంబంధాలపై మోదీ స్థిర నిర్ణయాలు తీసుకోకపోవడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ తప్పుపట్టారు.


