మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు

Afridi Made Sensational Comments About Narendra Modi About Relationship - Sakshi

కరాచీ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ షాహిద్ ఆఫ్రిది మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నరేంద్ర మోదీ ప్రధాని పదవిలో ఉన్నంత కాలం భారత్‌- పాక్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు జరగవంటూ పేర్కొన్నాడు. అంతేకాదు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ' భారత్‌, పాక్‌ల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే భారతదేశ ప్రధాని మోదీ. ఆయన అధికారంలో ఉన్నంత వరకు భారత్‌ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాదు.  అసలు మోదీ ఎజెండా ఏమిటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి ఒకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ మోదీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని  సూచిస్తున్నాయి' అంటూ తెలిపాడు. (‘భారత్‌-పాక్‌ సిరీస్‌ యాషెస్‌ కంటే గొప్పది’)

కాగా భారత జట్టు చివరిసారిగా రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో 2006లో పాక్‌లో పర్యటించింది. అయితే 2008లో 26/11 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పటినుంచి టీమిండియా పాక్‌ గడ్డపై అడుగు పెట్టలేదు. ఐసీసీ వేదికగా జరిగిన టోర్నమెంట్లలో తప్ప భారత్‌- పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగలేదు. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ జరిగితే.. 2013 నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. (ట్రంప్‌పై పీటర్సన్‌, ఐసీసీ సెటైర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top