తాడేపల్లి: కొత్త ఏడాది ఆరంభం కానున్న తరుణంలో తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
2026లో.. ప్రతి ఇంటా సుఖ శాంతలు వెల్లివిరియాలని, 2026 ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలన్నారు. వచ్చే ఏడాది.. అందరికీ ఆరోగ్యం అందించాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలన్నారు.


