సాక్షి, హైదరాబాద్: ఏపీ నీటి చౌర్యం చేస్తున్నా.. మనం మనవాటా వాడుకోలేని స్థితి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు హాజరైన సీఎం.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టు మార్పు చేశారని.. తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్ట్ అంటూ దుయ్యబట్టారు.
కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గిందని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ వినియోగిస్తున్న నీటి లెక్కలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్న రేవంత్.. కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. పంపులు పెరిగితే కమీషన్లు ఎక్కువ వస్తాయనేది బీఆర్‌ఎస్ ప్లాన్. కృష్ణాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను కేసీఆర్ వినిపించలేదు’’ అంటూ సీఎం విమర్శించారు.
‘‘ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు చేపట్టారు. ఏడేళ్ల వరకు పాలమూరు డీపీఆర్ కూడా తయారు చేయలేదు. రూ.32వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పెంచారు’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు.


