సాక్షి, అనంతపురం: నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అనంతపురంలో ఉద్రికత్త నెలకొంది. వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ జెడ్సీటీసీపై హత్యయత్నం చేయడంతో తీవ్ర గాయలయ్యాయి. దీంతో, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.
వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ రెచ్చిపోయారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతల ధర్నాకు దిగారు.
అనంతరం, ధర్నా చేస్తున్న వారిపై కూడా టీడీపీ నేతలు మరోసారి దాడి చేశారు. దీంతో, జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నేతల దాడుల నిరసనగా గాయాలతోనే యల్లనూరు పీఎస్ వద్ద ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బైఠాయించారు. కూటమి ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



