సురక్షితంగా ల్యాండ్‌ అయిన బిల్‌గేట్స్‌ విమానం | Bill Gates plane circling in the air | Sakshi
Sakshi News home page

సురక్షితంగా ల్యాండ్‌ అయిన బిల్‌గేట్స్‌ విమానం

Feb 16 2026 8:30 AM | Updated on Feb 16 2026 9:11 AM

Bill Gates plane circling in the air

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని ఎయిర్‌ పోర్టులో భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే తరుణంలో గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బిల్ గేట్స్‌ ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. తరువాత క్లియరెన్స్ రావడంతో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. నేడు(సోమవారం) బిల్‌గేట్స్‌ అమరావతిలో పర్యటించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement