ఏపీ: సర్వత్రా ఉత్కంఠ.. ‘పరిషత్‌’ ఎన్నికలపై నేడే తీర్పు

AP High Court Verdict Today On Parishad Elections - Sakshi

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు  గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్‌ జారీచేయాలని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చారు. (చదవండి: సీఎం జగన్‌ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ

ఈ తీర్పును రద్దుచేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దాఖలు చేసిన అప్పీలుపై ఆగస్టు 5న విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం సమర్థిస్తుందా? లేక పూర్తయిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేయాలని ఆదేశిస్తుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.(చదవండి: జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top