చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..

AP Zilla Parishad: Two Women ZPTC Swearing With Newborn Babies - Sakshi

నెల్లూరు (పొగతోట) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్లు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సభ్యులు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. నెల్లూరులోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న, తడ జెడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి రోజుల బిడ్డలతో హాజరయ్యారు. వీరిని సహాయకుల వద్ద ఉంచి వారు ప్రమాణ స్వీకారం చేశారు.  రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top