సాక్షి,విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ ఖజానా ఖాళీ అయ్యింది. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ పంచాయతీ రాజ్ శాఖ హైకోర్టుకు చెప్పింది.
2024 జూన్ నుంచి గౌరవ వేతనం చెల్లించడం లేదంటూ వైఎస్సార్ జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు గౌరవ వేతనం ఎందుకు చెల్లించలేదో ప్రమాణపత్రం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అందుకు పంచాయతీ రాజ్ శాఖ స్పందించింది. తమ ఖజానాలో నిధులు లేవని స్పష్టం చేసింది.


