
తుమ్మలపల్లెలో జెడ్పీటీసీ అభ్యరి హేమంత్‌రెడ్డి ఇంటి పక్కనే టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన షామియానా
వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఇంటిపక్కనే షామియానా
టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేసినా పట్టించుకోని పోలీసులు
సాక్షి టాస్‌్కఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ మూకలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. ఆయన ఇంటిపక్కనే షామియానాలు ఏర్పాటు చేసి టీడీపీ, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీలు కర్రలు చేతబూని ఓటర్లను యథేచ్ఛగా భయబ్రాంతులకు గురి చేశారు.
ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒకవేళ అటువైపు పోలీసులు వెళ్లినా టీడీపీ కార్యకర్తలు వారిని లెక్క చేయలేదు. కాగా.. తుమ్మలపల్లె పోలింగ్ బూత్ సమీపంలోనే టీడీపీ నేతలు షామియానాలు వేసి వందలాది మందికి టిఫిన్, భోజనాలు పెట్టారు.