
సాక్షి, నర్సీపట్నం: కొయ్యూరు వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ నూకరాజు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పరామర్శించారు. పోలీసుల వైఫల్యంతోనే జడ్పీటీసీ నూకరాజు హత్య జరిగిందని.. నూకరాజు హత్యకు పోలీసులే బాధ్యత వహించాలని విశ్వేశ్వరరాజు అన్నారు. గతంలో నూకరాజు అనేకసార్లు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మండిపడ్డారు.
ఆసుపత్రి వద్ద జడ్పీటీసీ నూకరాజు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిపి ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు పోస్ట్‌మార్టం చేయనివ్వమంటున్న కుటుంబ సభ్యులు.. హత్యకు ప్రోత్సహించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు
కాగా, జడ్పీటీసీ వారా నూకరాజు మృతదేహాన్ని నిన్న(సోమవారం) నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మార్చురి వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీడియోలు తీస్తున్న జర్నలిస్టుల మొబైళ్లను లాక్కున్నారు. మీడియా ప్రతినిధులపై పోలీసులు చిందులు తొక్కారు. మొబైల్ లాక్కొని వీడియోలు డిలీట్ చేసిన తర్వాత తిరిగి అప్పగించారు