సాక్షి, తాడేపల్లి: పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థులు మరణించడం బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రహదారిపై గురువారం రాత్రి ఓ కారు కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అయ్యప్ప మాలధారణలో ఉన్న ఐదుగురు బీటెక్ విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.


