జెడ్పీటీసీకి అమ్మాణీ రాజీనామా.. జనసేనకు ఉన్న ఏకైక జెడ్పీటీసీ లేనట్టే..

East Godavari: Ammani Resigns From ZPTC - Sakshi

సర్పంచ్‌గానే కొనసాగనున్నట్లు స్పష్టీకరణ 

సాక్షి, తూర్పుగోదావరి(కడియం): స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలి పదవికి మార్గాని అమ్మాణీ (జనసేన) రాజీనామా చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు సోమవారం రాజీనామా లేఖ అందజేసినట్లు ఆమె  తెలిపారు. భర్త ఏడుకొండలుతో కలిసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గతేడాది నామినేషన్‌ వేసినా ఎన్నిక వాయిదా పడడంతో కడియపులంక సర్పంచ్‌ పదవికి పోటీ చేసి గెలిచానన్నారు. ఇటీవల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలిచానన్నారు. గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సర్పంచ్‌గానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో జిల్లాలో జనసేనకు ఉన్న ఏకైక జెడ్పీటీసీ లేనట్టే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top