పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పుట్టామధుకు అవిశ్వాస తీర్మానం గండం?

Zptcs Preparing No Confidence Motion Peddapalli Zilla Parishad Chairman Putta Madhu - Sakshi

సాక్షి, పెద్దపల్లి: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ప్రస్తుత ఛైర్మన్‌ పుట్టామధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఆయనపై అవిశ్వాసం పెట్టడానికి జెడ్పీటీసీలు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఉత్కంఠ నెలకొంది.

జెడ్పీటీసీ సభ్యులు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. 2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి జడ్పీటీసీలు సిద్ధమవుతున్నారు. మెజార్టీ సభ్యుల అసమ్మతితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాగా, బుధవారం స్టాండింగ్​కమిటీ సమావేశం ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ జడ్పీటీసీలు కాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అసంతృప్త జడ్పీటీసీలు వేర్వేరు చోట్ల  క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

గత నెల 28న జరగాల్సిన జడ్పీ జనరల్​ బాడీ సమావేశం​  వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మెజారిటీ బీఆర్ఎస్​ సభ్యులు అవిశ్వాసానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది.

జిల్లాలోని 13 మంది జెడ్పీటీసీలకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడిన పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెజారిటీ సభ్యుల అసమ్మతి నేపథ్యంలో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది.

ఇదీ చదవండి: ముఖేష్‌ గౌడ్‌ కొడుకు దారెటు.?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top