పొంగులేటి ఎఫెక్ట్‌.. బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

Garla ZPTC Jatoth Jhansi Laxmi Resigned To BRS Party - Sakshi

బీఆర్‌ఎస్‌ పార్టీకి గార్ల జెడ్పీటీసీ రాజీనామా 

ఆమె బాటలో మరో 30 మంది నాయకులు, కార్యకర్తలు 

సాక్షి, గార్ల: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మహబూబాబాద్‌ జిల్లా గార్ల జెడ్పీటీసీ సభ్యురాలు జాటోత్‌ ఝాన్సీలక్ష్మి బుధవారం ప్రకటించారు. 

ఈ సందర్బంగానే ఆమెతోపాటు మరో 30 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గార్లలోని పొంగులేటి, కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం లభించలేదన్నారు. ఆయన వెంట తిరుగుతున్న జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్యకు సైతం ప్రభుత్వం భద్రతను తొలగించడం కక్షపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. 

ఇది కూడా చదవండి: భారత్‌ పరివర్తన్‌ మిషన్‌గా బీఆర్‌ఎస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top