ధరణి అక్రమార్కులను వదలం | Ponguleti Srinivas Reddy reviews with Stamps and Registration Department officials | Sakshi
Sakshi News home page

ధరణి అక్రమార్కులను వదలం

Feb 19 2026 4:13 AM | Updated on Feb 19 2026 4:13 AM

Ponguleti Srinivas Reddy reviews with Stamps and Registration Department officials

మంత్రి పొంగులేటి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ఆస్తుల రక్షణ కోసం నిర్మించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను గత ప్రభుత్వంలోని పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడు­కున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని­వాస్‌రెడ్డి మండిపడ్డారు. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను కొల్లగొట్టిన చలాన్ల కుంభకోణంపై జరిగిన ఉన్నత స్థాయి విచారణలో దిగ్భ్రాంతికరమైన విష­యాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభు­త్వ సొమ్మును కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతా­ధికారులను ఆదేశించారు. 

సచివాలయంలోని తన చాంబర్‌లో బుధవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రే­షన్ల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించా­రు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌.­లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, చలాన్ల కుంభకోణంపై నియమించిన కమిటీ సభ్యులు మంద మకరంద్, సింధుశర్మ, సంపత్, సుభాషిణి, శరత్‌కుమార్‌లు పాల్గొ­న్నారు. సమావేశంలో భాగంగా కమిటీ రూపొందించిన నివేదిక, ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కుంభకోణం కేవలం సాంకేతికపరమైన లోపమే కాదని, వ్యవస్థీకృత వైఫల్యమన్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన ఎవ­రినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాన­వ ప్రమేయంతో తప్పులు చేసేలా ధరణి పోర్టల్‌ను రూపొందించారని ఆరోపించారు. భూముల లావా­దేవీలకు సంబంధించి అనుమానాస్పదమైన భూము­ల సమాచారం లభించకుండా లాగిన్‌లు డిలీట్‌ చేశా­రని తెలిపారు. అత్యంత రహస్యంగా ఉండవలసిన లాగిన్‌ వివరాలు లేకుండా పోయాయని, కోడ్‌ ఆడిట్‌ కూడా నిర్వహించలేదని ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైందని చెప్పారు. 

తక్షణమే ధరణి పోర్టల్‌ లావాదేవీలపై కోడ్‌ఆడిట్‌ నిర్వహించాలని, భూభారతి పోర్టల్‌కు ఎ­లాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆడిటింగ్‌లు పూ­ర్తిచేసి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ఆదే­శించారు. ప్రజల భూముల విషయంలో ఎటువంటి రాజీ పడబోమన్నారు. ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికి తీస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహణకు చర్యలు తీసు­కోవాలని కూడా మంత్రి పొంగులేటి ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement