కేసులు పెట్టిందని.. కక్ష పెంచుకొని.. | Ex husband assassinated ex wife | Sakshi
Sakshi News home page

కేసులు పెట్టిందని.. కక్ష పెంచుకొని..

Feb 19 2026 4:08 AM | Updated on Feb 19 2026 7:31 AM

Ex husband assassinated ex wife

మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను దారుణంగా హత్య చేసిన మాజీ భర్త  

వనస్థలిపురంలో ఘటన...పోలీసుల అదుపులో నిందితుడు

హస్తినాపురం: తనపై కేసులు పెట్టి.. తన జీవితాన్ని నాశనం చేసి... తన తల్లిచావుకు కారణమైందంటూ మాజీ భార్యను కత్తితో తలపై నరికి పడక గదిలోనే అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన వనస్థలి­పురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చే­సు­కుంది. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ తోట మహేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన మహేశ్, మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా బల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన సునీత (29)లకు 2022లో వివాహం జరిగింది. 

వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కాగా, కెనడాకు వెళ్లారు. కుటుంబ కలహాల కారణంగా వారి దాంపత్య జీవితం సాఫీగా సాగలేదు. దీంతో కెనడా వెళ్లిన 4రోజులకే సునీత తిరిగి ఇండియాకు వచ్చింది. తన స్వగ్రా­మమైన బల్లాపూర్‌ పీఎస్‌లో తనను మహేశ్‌ వేధింపులకు గురిచేస్తున్నాడని కేసు పెట్టింది. 2024 డిసెంబర్‌లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 2025 ఏప్రిల్‌లో సునీత రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన శ్రీనివాస్‌ను రెండో వివాహం చేసుకుని హరిహరపురంలోని కెఎన్‌ఆర్‌ మెడోస్‌ గ్రీన్‌సిటీ కాలనీలోని అపార్టుమెంటులో ని­వా­సం ఉంటున్నారు. 

కాగా 2025 మార్చి నెలలో మహేశ్‌ తల్లి గుండెపోటుతో మరణించడంతో కెనడా నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు.  తనపై మాజీ భార్య సునీత క్రిమినల్‌ కేసు­లు పెట్టడం మూలంగానే తన తల్లి మృతి చెందిందని, తన జీవితం ఆగమైందని, తనను వేధింపులకు గురిచేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తోందని భావించి సునీతపై మహేశ్‌ కక్ష పెంచుకున్నా­డు. ఎలాగైనా సునీతను హతమార్చాలని నెల రోజుల క్రితం తుర్కయంజాల్‌­లోని ఓబాయ్స్‌ హాస్టల్‌లో ఉంటూ సునీత కద­లి­కలను గమనిస్తున్నాడు. 

బుధవారం మధ్యా­హ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఆమె నివా­సం ఉంటున్న ఇంటికివెళ్లాడు.ఇంట్లోని పడకగదిలో సునీత కనిపించడంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో తలపై విచక్షణారహితంగా నరకడంతో సునీత బెడ్‌పైనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గమనించిన సునీత అత్త భయబ్రాంతులకు గురై ఇరుగుపొరుగువారికి చెప్పడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు వచ్చేసరికి ఇంట్లోనే తలుపునకు గడియపెట్టి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను గదిలో పోసి తానూ ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లడంతో వెంటనే పక్కనే ఉన్న బాత్రూమ్‌లోకి వెళ్లి తాను కాల్చుకుంటానని పోలీసులను బెదిరించసాగాడు. పోలీసులు మహేశ్‌కు నచ్చజెప్పి బయటికి రప్పించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement