నేటి నుంచి రంజాన్‌ మాసం | Ramadan begins on Thursday | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రంజాన్‌ మాసం

Feb 19 2026 4:54 AM | Updated on Feb 19 2026 4:54 AM

Ramadan begins on Thursday

రుహియ్యతే హిలాల్‌ కమిటీ ప్రతినిధి ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంతో పాటు దేశ వ్యాప్తంగా నెలవంక కనిపించిందని, దీంతో గురువారం నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతుందని రుహియ్యతే హిలాల్‌ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) ప్రతినిధి, జామియే నిజామియా ధార్మిక సంస్థ అమీర్‌ ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌ తెలిపారు. 

మో జంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ నెలవంక బుధవారం నగరంతో పాటు దేశంలోని వివిధ ప్రదేశాల్లో కనిపించినట్లు సమా చారం అందినట్లు వివరించారు.దీంతో ముస్లింలు రంజాన్‌ నెల ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభించాలని సూచించారు. 

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ నెలవంక నిర్ధారణ కమిటీలతో పాటు ఢిల్లీ కమిటీ కూడా నెలవంక కనిపించినట్లు ప్రకటించిందని తెలిపారు. అన్ని కమిటీలతో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement