ఆర్టీసీ బస్సు బోల్తా, నలుగురి పరిస్థితి విషమం | Rtc Bus Overturns In Jogulamba Gadwal District | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా, నలుగురి పరిస్థితి విషమం

Feb 19 2026 7:05 AM | Updated on Feb 19 2026 10:19 AM

Rtc Bus Overturns In Jogulamba Gadwal District

జోగులాంబ గద్వాల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బెంగళూరు 44 జాతీయ రహదారిపై ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి అనంతపూరు కు వెళ్తున్న సూపర్ లెగ్జరీ బస్సులో ప్రమాద సమయంలో 20 మంది ప్రయాణీకులు ఉన్నట్టు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తే వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement