కౌంటింగ్‌ కేంద్రం ముందు ఆర్కే రోజా నిరసన | Rk Roja Protest At Nagari Counting Center | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ కేంద్రం ముందు ఆర్కే రోజా నిరసన

Nov 7 2026 1:45 PM | Updated on Nov 7 2026 2:03 PM

Rk Roja Protest At Nagari Counting Center

సాక్షి, చిత్తూరు జిల్లా: నగరి కౌంటింగ్‌ సెంటర్‌ దగ్గర మాజీ మంత్రి రోజా ఆందోళనకు దిగారు. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అయితే, వైఎస్సార్‌సీపీ గెలిచినా.. టీడీపీ గెలిచిందంటూ అధికారులు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పోలీసులు బయటకు నెట్టేశారు. పోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా రోజా.. కౌంటింగ్‌ కేంద్రం ముందు రోజా బైఠాయించారు.

రోజాపై పోలీసుల దౌర్జన్యం
రోజాపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నిరసనకు దిగిన రోజాను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. టీడీపీ నేతలు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచానా డిక్లరేషన్‌ ఫాం ఇవ్వడం లేదని.. గెలిచే ధైర్యం లేనప్పుడు ఎన్నికలు ఎందుకు పెట్టారు?’’ అంటూ రోజా మండిపడ్డారు.

ఇదీ చదవండి: తప్పు చేసి.. తప్పుడు కేసు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement