మూడు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల కలయికపై నెటిజన్ల ఆసక్తి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
సాక్షి, అమరావతి : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో ఈ ముగ్గురు నేతలు కలుసుకున్న దృశ్యాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోకు భారీ స్పందన లభించింది. ఈ పోస్టుకు 2.57 లక్షల వ్యూస్, 15 వేల లైక్స్, 2,200 రీపోస్టులు వచ్చాయి. అదే విధంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, టీవీ వీడియోలు, రీల్స్‌కు కలిపి కోట్లలో వ్యూస్ నమోదయ్యాయి. మూడు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకే చోట కనిపించడంతో వారి అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
శ్రేయ–ఉజ్వల్‌లకు వైఎస్ జగన్ దంపతుల ఆశీస్సులు (ఫోటోలు)
వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, విజయ్, కేటీఆర్ (ఫోటోలు)


