తమ్మినేని అమ్మాజీ గురి అదుర్స్‌! | Head Constable Tammineni Ammaji Is Showing Talent In Srikakulam | Sakshi
Sakshi News home page

తమ్మినేని అమ్మాజీ గురి అదుర్స్‌!

Sep 7 2026 1:23 PM | Updated on Sep 7 2026 1:26 PM

 Head Constable Tammineni Ammaji Is Showing Talent In Srikakulam

గురిపెడుతున్న హెడ్‌ కానిస్టేబుల్‌ తమ్మినేని అమ్మాజీ

శ్రీకాకుళం: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు, శ్రీకాకుళం రూరల్‌ మండలం సనపలవానిపేటకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ తమ్మినేని అమ్మాజీ షూటింగ్‌ విభాగంలో జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. శ్రీకాకుళం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నఅమ్మాజీ ఇటీవల నిర్వహించిన ఏపీ పోలీస్‌ మీట్‌ షూటింగ్‌ పోటీల్లో రజత పతకం సాధించి సత్తా చాటారు. 

ఓవైపు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు షూటింగ్‌ క్రీడపై ఆసక్తితో నిరంతరం సాధన చేసి పోటీల్లో కచ్చితమైన గురితో అద్భుత ప్రదర్శన కనబరిచారు. తన ప్రతిభతో మూడు రజత పతకాలను కైవసం చేసుకుని శ్రీకాకుళం జిల్లా పోలీస్‌ శాఖకు గర్వకారణంగా నిలిచారు. గతంలో కూడా జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ఎనిమిది పతకాలు సాధించి ప్రశంసలు అందుకున్నారు. 

అభినందనల వెల్లువ..  
తాజాగా నిర్వహించిన పోటీల్లో మూడు పతకాలు సాధించిన తమ్మినేని అమ్మాజీని పోలీస్‌ అధికారులు, సహచర సిబ్బంది, కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడా రంగంలోనూ ప్రతిభ కనబరుస్తూ పతకం సాధించడం అభినందనీయమని ప్రశంసించారు. మహిళా పోలీస్‌ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తూ, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.  

చదవండి: 8వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement