శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ (77) సోమవారం మృతి చెందారు. ఆదివారం శ్రీకాకుళంలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనను చేర్చారు.
అక్కడ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని అరసవల్లిలోని స్వగృహానికి తరలించారు. కుమారులు అమెరికా నుంచి సోమవారం అర్ధరాత్రి రానున్నారు. మంగళవారం అంత్యక్రియలు జరVý నున్నాయి. ఆయన మృతిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతాపం వ్యక్తం చేశారు.


