శ్రీకాకుళం: కిడ్నీ మహమ్మారికి మరొకరు బలయ్యారు. కవిటి మండలం ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన దొళాయి సోమేశ్వరరావు కిడ్నీవ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె పావని తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. కిడ్నీ మహమ్మారి కారణంగా ఉద్దానంలో ఇంటిపెద్దను కోల్పోవడం ద్వారా వందలాది కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి.


