అరసవల్లి రథసప్తమి వేడుకలు.. భక్తుల మధ్య స్వల్ప తోపులాట | Rathasaptami Celebrations at Arasavalli Temple | Sakshi
Sakshi News home page

అరసవల్లి రథసప్తమి వేడుకలు.. భక్తుల మధ్య స్వల్ప తోపులాట

Jan 25 2026 8:39 AM | Updated on Jan 25 2026 8:45 AM

Rathasaptami Celebrations at Arasavalli Temple

సాక్షి,శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఉత్సవాల ప్రారంభంగా నిర్వహించిన క్షీరాభిషేకం సేవ వైభవంగా సాగింది.

ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంతో భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఆలయ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఉత్సవాల కోసం ప్రత్యేకంగా జారీ చేసిన ఎంట్రీ పాస్‌లు, స్లాట్ పాస్‌లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పేరుకే పాస్‌లు ఇస్తున్నారు కానీ లోపలికి అనుమతించడం లేదు. కనీసం దర్శనం కూడా కల్పించడం లేదు’ అంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

భక్తుల రద్దీ కారణంగా క్రమపద్ధతిలో దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు. పాస్‌లతో సంబంధం ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement