టెక్కలి: రాష్ట్రంలోని వ్యవసాయ శాఖను మంత్రి అచ్చెన్నాయుడు అవినీతిమయం చేశారని వైఎస్సా ర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరో పించారు. బుధవారం టెక్కలిలో ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని విస్మరించిన అచ్చెన్నకు కనీసం రైతుల కోసం మా ట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ ఇవ్వలేదని.. ఆ తర్వాత ఏడాది ఇచ్చినా హామీ మేరకు సాయం అందజేయకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు తన సొంత పేషీలో ఓఎస్ డీగా పోలినాయుడిని నియమించుకొని వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలులో కోట్లలో అవినీతి చేశారని, దీనికి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ తిరుగుబాటు నిదర్శనమన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు కిలోమీటర్ల మేర క్యూ కట్టిన సంగతి మరచిపోయారా అని ఎద్దేవా చేశారు. గతేడాది సంభవించిన తుపాన్‌తో నష్టపోయిన రైతులకు ఎంత మేరకు ఆదుకున్నారో బహిరంగంగా చెప్పాలని నిలదీశారు. టెక్కలి నియోజకవర్గంలో తన సొంత అన్నతో కలిసి మిల్లర్ల సాయంతో రైతుల నుంచి అన్యాయంగా ధాన్యం దోపిడీ చేయించారని విమర్శించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సాగునీరు ఇవ్వలేని అసమర్థ మంత్రి.. వైఎస్సార్‌సీపీ పాలనలో రైతు సంక్షేమంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చెన్నాయుడికి లేదు


