హిరమండలం: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు సింహాచలం ఆరోపించారు. కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి..పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎల్‌ఎన్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి వేతనదారులకు అవగాహన కల్పించారు. నిరుపేదలకు ఎంతగానో ఉపాధి కల్పించే పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలనుకోవడం దారుణమన్నారు. రాష్ట్రాలకు 40 శాతం వాటాను బదలాయించడం ద్వారా పథకం అమలును నీరుగార్చుతున్నారని ఆరోపించారు.


