బ్యాంకు ఉద్యోగాలిప్పిస్తానని..
● ఢిల్లీలో సెంట్రల్ జోనల్ ఆడిటర్‌నని చెప్పి మోసం ● శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి, విశాఖ, తాడేపల్లిగూడెంలలో దోపిడీ ● ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడిన అంతర్ జిల్లా నేరస్తుడు బెనర్జీ
శ్రీకాకుళం క్రైమ్ : బ్యాంకులో పీవో, క్లర్క్ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించిన అంతర్‌జిల్లా నేరస్తుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళంతో పాటు తిరుపతి, నెల్లూరు, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అమాయక యువత నుంచి రూ.కోట్లలో దోపిడీ చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన గొల్ల బెనర్జీని శ్రీకాకుళం రూరల్ మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియాకు వెల్లడించారు.
సెంట్రల్ జోన ల్ ఆడిటర్‌నంటూ..
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఒవ్వేరు గ్రామానికి గొల్ల బెనర్జీ అలియాస్ హర్షవర్ధన్‌రెడ్డి ఇంటర్ చదివి సీఏ కోర్సులో చేరి మధ్యలోనే మానేశాడు. అకౌంట్స్‌పై పరిజ్ఞానం సంపాదించాడు. నెల్లూరులో ఓ మహిళను వివాహమాడి ఇద్దరు పిల్లలను కన్నాక విడిచిపెట్టేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అనంతరం అరసవల్లిలో దేశెట్టి రమణమూర్తి ఇంట్లో అద్దెకు దిగాడు. రమణమూర్తి స్వగ్రామం నందిగాం మండలం నర్సిపురం. ఢిల్లీ సెంట్రల్ జోనల్ ఆడిట్ అధికారిగా పనిచేసి ఇటీవల విశాక రీజియన్‌కు బదిలీపై వచ్చానని, పలు బ్యాంకుల రిక్రూట్‌మెంట్ బోర్డులో మెంబర్‌నని బెనర్జీ నమ్మించాడు.
పీవోలు, క్లర్కు పోస్టులిప్పిస్తానని..
ఎస్బీఐ బ్యాంకులో బ్యాక్‌లాగ్ పోస్టుల కింద పీవో, క్లర్కు పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఒక్కో ఉద్యోగానికి రూ. 6 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కడితే ఉద్యోగమిప్పిస్తానని యువను నమ్మబలికాడు. అలా ఆరుగురి నుంచి రూ. 36 లక్షలు తీసుకున్నాడు. వారికి నకిలీ అపాయిట్‌మెంట్ ఆర్డర్ కాపీలు సైతం ఇచ్చాడు. ఈ మేరకు బాధితులు 2024 నవంబరు 12న జిల్లా ఎస్పీ గ్రీవెన్సును ఆశ్రయించారు. బెనర్జీ తమ వద్ద రూ. 1.80 కోట్లు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థలాలిప్పిస్తానని..
చినబజారు రోడ్డులో 8 సెంట్ల స్థలం వేలానికి వస్తుందని, తన పరిచయాలతో తక్కువ ధరకు ఇప్పిస్తానని దేశెట్టి రమణమూర్తి వద్ద రూ. 86 లక్షలను బెనర్జీ తీసుకున్నాడు. రూ.29 లక్షల విలువైన గోల్డ్ క్రాఫ్ట్ మెషీన్‌ను రూ.14 లక్షలకే ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. మొత్తంగా రమణమూర్తి నుంచి రూ.1.05 కోట్లకు టోరరా వేశాడు. జిల్లాలో తన మోసాలు బయటపడటం, పలువురు ఫిర్యాదులివ్వడంతో బెనర్జీ మకాం మార్చేశాడు..
పలు ప్రాంతాల్లో సైతం.
తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు, వారి సోదరుడు, సోదరుని కుమార్తె నుంచి కొంత నగదు తీసుకున్నాడు. విశాఖపట్నంలో 8 మంది నుంచి రూ.కోటి తీసుకోగా, నెల్లూరులో 2 చీటింగ్ కేసులు, బుచ్చిడ్డిపాలెంలో 1, తాడేపల్లి గూడెంలో 1, ఏఎస్‌పేట పీఎస్‌లో ఒక కేసు ఉన్నాయి.
ïÜIyîlీ OòÜ™èl… íœÆ>ŧýl$..
మూడేళ్లుగా ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బెనర్జీపై అరసవల్లిలో ఉంటున్న నందిగాం వాసి రమణమూర్తి మంగళగిరి సీఐడీ డీజీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. విచారణ నివేదికను తదుపరి చర్యల కోసం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డికి పంపించారు. డీఎస్పీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో రూరల్ పరిధి కావడంతో సీఐ పైడపునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనకొచ్చిన సమాచారంతో సీఐ పైడపునాయుడు బెనర్జీని నగరంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.


