శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు వెంటనే ఆపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్ డిమాండ్ చేశారు. కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్ జంక్షన్ వద్ద యుద్ధం వద్దు– శాంతి కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. యుద్ధం కొనసాగితే ప్రపంచమంతా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే దేశంలో ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల తదితర అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ కె.అప్పారావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ ఆర్.ఎస్.ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి, బి.ఎస్.ఎన్.ఎల్ జిల్లా అధ్యక్షుడు ఎం.గోవర్దనరావు, ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు, కళాసీ సంఘం జిల్లా కోశాధికారి పి.అప్పలరాజు, ఎన్.ఎ.సి.ఎల్ నాయకులు ఎల్.రామప్పుడు, ఎం.రమణ, పి.సుధాకర్, స్మార్ట్ కెమ్ యూనియన్ నాయకులు పి.జగ్గారావు, కామినాయుడు, సోమశేఖరరావు, టి.బుజ్జిబాబు, బి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


