కూటమి నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇదేంటని ప్రశ్నిస్తున్న వారిపై దౌర్జన్యానికి దిగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా పంచా యతీ వెంకటాపురంలోని గొల్లవీధి గ్రామంలో పల్ల చిన్నవాడుకు చెందిన రిజిస్ట్రేషన్ భూమిలో తూర్పువైపు రెండున్నర అడుగుల స్థలంలో కూటమి నాయకులు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారు.
ఇదే విషయమై బాధిత కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు బుధవారం వాగ్వాదానికి దిగారు.
– శ్రీకాకుళం రూరల్


