ప్రతినిత్యం ప్రజాపక్షం | - | Sakshi
Sakshi News home page

ప్రతినిత్యం ప్రజాపక్షం

Mar 12 2026 7:13 AM | Updated on Mar 12 2026 7:13 AM

ప్రతినిత్యం ప్రజాపక్షం తొలిసారి ప్రతిపక్ష హోదాలో.. 2019 ఎన్నికల్లో విజయబావుటా.. 2024లో...

పదిహేనేళ్లుగా ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌సీపీ అలు పెరగని పోరాటం, ప్రజా పాలనతో గుర్తింపు నేడు 16వ వసంతంలోకి..

విజయవంతం చేయండి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం పురుడు పోసుకుని అనేక పోరాటాల నడుమ, ప్రజల ఆశీస్సులతో ఎదిగిన రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీ. అనేక ఒడిదుడుకుల మధ్య ప్రజా పార్టీగా నిలిచిన వైఎస్సార్‌సీపీ గురువారం 16వ వసంతంలోకి అడుగు పెడుతోంది. 2011 మార్చి 12న అవతరించి ప్రజలకు అండగా నిలవడమే కాకుండా సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లింది. పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటాలనే నమ్ముకుంది. ఓదార్పు యాత్రతో ప్రారంభమై ప్రజల కష్టాల్లో భాగస్వామ్యమైంది. 2011 నుంచి 2019 వరకు అలుపెరగని పోరాటం చేసి ప్రజల మనసులను గెలుచుకుంది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో 2014 ఎన్నికల్లో పాల్గొని ప్రధాన ప్రతిపక్షంగా జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. అంతకుమించి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ భేరి మోగించారు. 2014–19 మధ్య అనేక ప్రజా సమస్యలపై ఉద్యమించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల మధ్య నడిచి జిల్లాలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సుదీర్ఘ పాదయాత్ర ఇచ్ఛాపురంతో ముగించి ఎన్నికల కదన రంగంలోకి దిగారు.

2019 ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిదింటిని దక్కించుకుని పూర్తి ఆధిపత్యం కనబరిచారు. అనేక సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెటర్నరీ క్లినిక్‌లను నిర్మించారు. వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. జగనన్న కాలనీలతో పేదల సొంతింటి కల నెరవేర్చారు. వంశధార ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేశారు. మూలపేటలో పోర్టు నిర్మించారు. ఉద్దానంలో పట్టి పీడిస్తున్న కిడ్నీ రోగుల కోసం రీసెర్చ్‌ కమ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు డయాలసిస్‌ సెంటర్లు నిర్మించారు. సురక్షిత మంచినీరు అందించేందుకు ఉద్దానానికి రూ.800 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించారు. ఆరోగ్యశ్రీతో పాటు 108, 104 సేవలను విస్తృతం చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో వేలాది మంది ప్రాణాలు నిలబెట్టారు. బుడగట్లపాలెంలో పిషింగ్‌ హార్బర్‌, ఆమదాలవలస నియోజకవర్గంలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌, వెటర్నరీ పాలిటెక్నిక్‌, హార్టీకల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ పథకాలు అందాయి. ప్రజల జీవితాల్లో ప్రగతి సుమాలు విరబూశాయి.

ఎంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించినా 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడానికి వెనుక అనేక కుట్రలు ఉన్నాయన్న సందేహం అందరిలో ఉంది. ఓటు వేశాం గాని.. ఎందుకో గెలవలేదన్న వారు లక్షల్లో ఉన్నారు. ఓడినా వెనక్కి తగ్గకుండా ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు, హత్యా రాజకీయాలు, పచ్చనేతల లైంగిక వేధింపులు, పోలీసుల ఉక్కుపాదం.. ఇలా ఎన్నో అకృత్యాలపై ఉద్యమాలు చేస్తూనే ఉంది. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట నుంచి శ్రీకాకుళంలో చోటు చేసుకున్న డయేరియా వరకు బాధితుల పక్షాన నిలిచింది. ప్రజా పోరాటమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తథ్యమన్న స్థాయికి చేరుకుంది.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ౖవెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ, ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్‌కు చేరుకుని దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించడం, ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్‌ కటింగ్‌ జరుగుతుందని పేర్కొ న్నారు. అనంతరం కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement