శ్రీకాకుళం: మండలంలోని పెంటూరుకు చెందిన పొందూరు కుమారి ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది. బడబంద గ్రామానికి చెందిన పొందూరు వైకుంఠరావు, భారతమ్మల చిన్న కుమార్తె అయిన కుమారిని పెంటూరు చెందిన నడుపూరు హరీష్ కు 2022లో ఇచ్చి వివాహం చేశారు. భర్త ఏఆర్ కానిస్టేబుల్‌గా విజయవాడలో పనిచేస్తుండడంతో అక్కడే కోచింగ్ తీసుకొని ఈ ఉద్యోగాలు సాధించినట్లు ఆమె తెలిపారు.
రీజనల్ రూరల్ బ్యాంక్(ఆర్‌ఆర్‌బీ) పీవో, ఆర్‌ఆర్‌బీ క్లర్క్, ఎస్‌బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్(కెనరా బ్యాంకు)గా నాలుగు ఉద్యోగాలు పొందటమే, కాకుండా ఎల్‌ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మూడు విడత ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని చివరి విడత ఇంటర్వ్యూకు ఎదురు చూస్తోంది. అయితే వీటిలో రీజనల్ రూరల్ బ్యాంకు పీవోగా విధుల్లో చేరుతానని, తన భర్త హరీష ఇచ్చిన సహకారంతోనే ఈ ఉద్యోగాలు సాధించానని కుమారి తెలిపారు.


