పిల్లలతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్
గత నెలే అధికారుల చెంతకు చేరిన వీడియో
మీడియాకు తెలియకుండా జాగ్రత్త వహించిన అధికారులు
టీచర్‌ను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు
శ్రీకాకుళం జిల్లా: బందపల్లి బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉపాధ్యాయిని యవ్వారం సుజాతపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమె విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయ్యింది. నిజానికి గత నెలే ఈ వీడియో అధికారులకు చేరింది. కానీ బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో బయటపడి వైరల్ కావడంతో టీచర్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీడియోపై టీచర్‌ను వివరణ కోరడానికి ‘సాక్షి’ సంప్రదిస్తే ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
ఎప్పడు జరిగిందో నాకు తెలియదు
ఇప్పటివరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలియవు. సోషల్ మీడియా లో ఫొటో చూశాను అంతే. ఇది ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు పై అధికారులకు తెలియజేశాను.
– ఎస్.దేవేంద్రరావు ఎంఈఓ, మెళియాపుట్టి
వీడియో ఎవరు తీశారో తెలీదు
వీడియో బయటకు రావడంతో పీఓ ఆమెకు నెల కిందటే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దానికి ఆమె సమాధానం ఇ చ్చారు. ఏం వివరణ ఇచ్చారో నాకు తెలీదు. టీచర్‌ను వివరణ కోరగా.. ఆరోగ్యం బాగోక అలా చేశానని తెలిపా రు.
– దార ప్రశాంతి కుమారి, ప్రధానోపాధ్యాయురాలు
#Srikakulam —
A teacher from Bandapalli Girls’ Tribal Ashram School has been suspended after a video showing her talking on the phone while students massaged her legs went viral on social media.
The teacher, identified as Sujatha, was captured in the video sitting and speaking… pic.twitter.com/KoaUZikGSm— NewsMeter (@NewsMeter_In) November 4, 2025


