వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ (ఎన్‌ఆర్‌ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అక్కడి పార్టీ కన్వీనర్ బుజ్జి బాబు నెల్లూరి నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.

ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో.. గోవర్ధన్ మల్లెల, NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కసుంగాటి, సైంటిస్ట్ బాల బీరమ్, లింక్ టు గ్రూప్ సర్వీసెస్‌కు చెందిన ఇందిరా సిరిగిరి, ఎస్‌జి కన్సల్టెన్సీ వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, యూనివర్సల్ గ్రానైట్స్ శివ కిలారి, NZTA అధ్యక్షుడు జనక్, NZTA మాజీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, TANZ అధ్యక్షుడు చంద్రశేఖర్ కొడూరి , నిధి చిట్స్ మురళి, ట్రాన్స్‌ఫసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రోహిత్‌రెడ్డి, రామ్ మోహన్ దంతాల, లుక్స్ స్మార్ట్ డైరెక్టర్ పండు, ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రదీప్, మ్యాంగో బైట్ డైరెక్టర్ నిర్మల్ పాండే, కృష్టా రెడ్డి, శ్రీనివాస్ పనుగంటి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.





