సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఆకుతోటపల్లిలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టౌటౌన్ సీఐ శ్రీకాంత్‌పై దాడి యత్నం జరిగింది. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు.
స్థానికంగా ఉన్న అజయ్ అనే వ్యక్తి నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో అజయ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అయితే నిందితుడు సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడికి యత్నించగా.. ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు.
దీంతో అజయ్ కాలు నుంచి తూటా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్‌కు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.


