తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సులో మంటలు | A fire broke out in an RTC bus in Naidupeta Tirupati district | Sakshi
Sakshi News home page

తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సులో మంటలు

Feb 5 2026 11:47 PM | Updated on Feb 5 2026 11:55 PM

A fire broke out in an RTC bus in Naidupeta Tirupati district

తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల క్రాస్ రోడ్ వద్ద గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి వినుకొండకు వెళుతున్న ఈ బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. 

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement