తిరుపతిలో చోరీ కలకలం.. | Theft Incident At The Tirupati Police Station In Bhavani Nagar | Sakshi
Sakshi News home page

తిరుపతిలో చోరీ కలకలం..

Aug 4 2026 12:24 AM | Updated on Aug 4 2026 12:24 AM

Theft Incident At The Tirupati Police Station In Bhavani Nagar

ఆంధ్రప్రదేశ్‌: తిరుపతి పోలీస్ స్టేషన్ పరిధి భవాని నగర్‌లో చోరీ ఘటన కలకలం రేపింది. ఒంటరిగా నివసిస్తున్న లక్ష్మి అనే మహిళ ఇంటిలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.

బాధితురాలు ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ, బీరువాలో భద్రపరిచిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఉదయం లేచి చూసిన బాధితురాలు నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధారాలను సేకరించి, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే, నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement