తాడిపత్రిలో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి | Tadipatri Tensions, TDP Leader JC Prabhakar Reddy Sparks Row At Wedding Over YSRCP Leaders Presence | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి

Aug 16 2026 3:35 PM | Updated on Aug 17 2026 7:36 AM

High Tension in Tadipatri anantapur District

అనంతపురం:  జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ వివాహ వేడుకకు హాజరైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. ఓ వివాహ వేడుకకు వైఎస్సార్‌సీపీ నేతలు రావడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం  వ్యక్తం చేస్తూ.. అనుచితంగా ప్రవర్తించారు. కళ్యాణ మండపానికి తలుపులు వేసేసి మరీ తన అహంకార పూరిత ధోరణిని ప్రదర్శించారు. దాంతో మండపంలోనే మంత్రి జనార్థన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరాంరెడ్డిలు ఉండిపోయారు. 

సర్ది చెప్పేందుకు యత్నించిన శ్రీరాంరెడ్డిపై దౌర్జన్యం చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి వాగ్వాదానికి దిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.  ఈ క్రమంలోనే ఓ కారును ధ్వంసం చేశారు జేసీ వర్గీయులు. ఈ ఘటన మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం. వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయాలు చేసిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement