‘మేము మీలాగ ప్రత్యేక జీవోలతో పోస్టులు అమ్ముకోలేదు’ | Former Minister Adimulapu SuresH Slams Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘మేము మీలాగ ప్రత్యేక జీవోలతో పోస్టులు అమ్ముకోలేదు’

Aug 16 2026 7:58 PM | Updated on Aug 16 2026 8:03 PM

Former Minister Adimulapu SuresH Slams Chandrababu Sarkar

తాడేపల్లి : కూటమి ప్రభుత్వం పెద్దలు డీఎస్సీలో అక్రమాలు కప్పి పుచ్చుకునేందుకు గ్రూప్‌-1ని వివాదం చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. డీఎస్సీలో అక్రమాలు చేసి చంద్రబాబు ప్రభుత్వం అభాసుపాలైందని, దాన్ని డైవర్ట్‌ చేయడానికి గ్రూప్‌-1 అంటూ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ రోజు(ఆదివారం, ఆగస్టు 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆదిమూలపు సురేష్‌.. ‘ గ్రూప్ 1 లో ఎక్కడా తప్పు జరగలేదని సిట్ కూడా తేల్చింది. మరి చంద్రబాబు ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తారు?, గ్రూప్ 1 లో మేము ఎక్కడా రాజీ పడలేదు. డీఎస్సీలో లాగా ప్రత్యేక జీవోలు తెచ్చి పోస్టులు అమ్ముకోలేదు. 

అలాంటప్పుడు గ్రూప్ 1, డీఎస్సీకి ఎలా ముడి పెడతారు?, గ్రూప్ 1 లో పేపర్ మూల్యాంకనం మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు. దానిపై కూడా హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించాం. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం నియమించిన  అధికారులే గ్రూప్ 1 మూల్యాంకన సమయంలో ఉన్నారు. వారిని చులకన చేసేలా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోంది. అభ్యర్థులు రాసిన పరీక్షా పత్రాలు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి.. కావాలంటే ఎవరైనా సరే వెళ్లి చెక్ చూసుకోవచ్చు’ అని సవాల్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement