తిరుపతిలో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య | NEET student commits suicide in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

Aug 10 2026 5:02 AM | Updated on Aug 10 2026 5:02 AM

NEET student commits suicide in Tirupati

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన 

తిరుపతి సిటీ: నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ నగర్‌కు చెందిన సాయి మేఘన (18) తల్లిదండ్రులు కూలీలు. తమ కుమార్తెను డాక్టర్‌గా చూడాలనే ఆకాంక్షతో వారు ఆమెను కష్టపడి చదివించారు. దానికి ప్రతిఫలంగా సాయిమేఘన ఇంటర్‌ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించి తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణ తీసుకుంది. ఈ ఏడాది మే లో జరిగిన నీట్‌ పరీక్ష రాసింది. అందులో 499 మార్కులు వచ్చాయి. 

అయితే నీట్‌ పేపర్‌ లీక్‌ కావడంతో ఎన్‌టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించగా అందులో ఆమెకు 390 మార్కులే వచ్చాయి. దీంతో డాక్టర్‌ కావాలనుకున్న ఆమె ఆశ నిర్వీర్యమైందనే మనోవేదనతో 10 రోజుల క్రితం సాయిమేఘన ఆత్మహత్య చేసుకుంది. కానీ కుటుంబీకులు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మదనపడుతూ ఆదివారం కర్మక్రియలు నిర్వహించారు. అక్కడికి పలువురు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు వచ్చి నివాళులర్పించిన సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో సాయిమేఘన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement