నేడు జోగి రమేష్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan to visit Jogi Ramesh family today | Sakshi
Sakshi News home page

నేడు జోగి రమేష్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Feb 6 2026 5:36 AM | Updated on Feb 6 2026 5:36 AM

YS Jagan to visit Jogi Ramesh family today

సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించనున్నారు. 

వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసానికి చేరుకుంటారు. టీడీపీ గూండాలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించి, జోగి రమేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

 

Advertisement
 
Advertisement
Advertisement