వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర | Police Imposed Restrictions On YS Jagan Visit To Jogi Ramesh Home In Vijayawada Ibrahimpatnam, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర

Feb 5 2026 8:53 PM | Updated on Feb 6 2026 1:09 PM

Police imposed restrictions on YS Jagan visit to Jogi Ramesh home in Vijayawada

సాక్షి,తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రకు తెరలేపింది.

వైఎస్‌ జగన్‌ శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసానికి వెళ్లనున్నారు. జోగిరమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చాలని పోలీసుల నోటీసులు జారీ జారీ చేశారు.  విజయవాడ సీపీ స్వయంగా వైఎస్‌ జగన్‌కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. 

టీడీపీ గూండాల దాడితో భయాందోళనకు గురవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల్ని బుధవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఇందుకోసం తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు పట్టాభిపురంలో అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌ వెళ్లారు. నిన్నటి వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటనకు కదలి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమి ప్రభుత్వ కుట్రకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్.. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. రెండు రోజుల కిందటే పార్టీ రూట్ మ్యాప్ ఇచ్చినా, హఠాత్తుగా పోలీసులు ఆంక్షలు విధించడంతో పర్యటనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. 

Advertisement
 
Advertisement
Advertisement