అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలీసులు టార్గెట్ చేశారు.
బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి సహా ఐదుగురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా ఎందుకు నిర్వహించారంటూ పోలీసులు ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
జగన్ బర్త్‌డే వేడుకలకు సంబంధించి సరైన కారణాలు చెప్పకుండానే నేతలను అదుపులోకి తీసుకోవడం అక్రమ అరెస్టులేనని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సాక్షి విలేఖరి శాంత కుమార్‌ని ఎస్సై నరేంద్ర దుర్భాషలాడు.


