‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అప్‌డేట్స్..
వైఎస్సార్‌సీపీ భారీ బహిరంగ సభ
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గల మూలపేట పోర్ట్ పనులు త్వరితగతన జరగాలని ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నౌపాడలో జరిగిన భారీ బహిరంగ సభ. ఈ సభకు భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులు.



ధర్మాన ప్రసాదరావు కామెంట్స్..
- చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నోరులని ప్రాంతాలకు అన్యాయం చేస్తోంది.
- అన్ని ప్రాంతాలకు సంపద సమానంగా పంపిణీ చేయాలి.
- టీడీపీ ప్రభుత్వం ఏనాడైనా శ్రీకాకుళం జిల్లాకు శాశ్వతమైన పనిచేసిందా?.
- ఎల్లో పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ చూసి ప్రజలు మోసపోతున్నారు.
- తరిమికొట్టే రోజు వచ్చినప్పుడే భయపడి అభివృద్ధి చేస్తారు.
- దిగజారి మూలపేట పోర్టు మేమే తెచ్చామని కేంద్రమంత్రి చెప్తున్నారు.
- మనం మౌనంగా ఉంటే మన జిల్లా అభివృద్ధిని పట్టించుకోరు.
- టీడీపీ ఎమ్మెల్యేలే రాక్షసుల్లా దాడులు చేస్తున్నారు.
- కూటమి ఎమ్మెల్యే దుర్మార్గాలు చూస్తే సిగ్గేస్తోంది.
- వైఎస్సార్‌సీపీ హయాంలో 30 లక్షల ఇళ్లు కట్టించాం.
- వైఎస్ జగన్ గొప్ప నాయకుడు, విశాలమైన భావాలున్న నాయకుడు.
బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- మూలపేట ఈ ప్రాంత అభివృద్ధి కాదు రాష్ట్ర మొత్తం అభివృద్ధి.
- దూరదృష్టితో పోర్టును వైఎస్ జగన్ నిర్మించారు..
- కూటమి ప్రభుత్వం పోర్టును పట్టించుకోలేదు.
- ప్రజల కష్టాలను పట్టించుకోలేదు..
- కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సభ పెట్టడానికి వచ్చాము
- రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లి రీల్స్ తీసుకునేవారు.
- భోగాపురం ఎయిర్ పోర్టు వైఎస్ జగన్ కృషి కాదా?.
- కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ జగన్ చేసిన మంచిని అచ్చెన్నాయుడు మర్చిపోయావా?.
- వైఎస్ జగన్ పనులను వారి మెప్పు కోసం ప్రచారం చేసుకుంటున్నారు..
- 30 శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదు..
- కాంట్రాక్టర్కు మీకు సెట్టింగ్ కుదరలేదా?
- పోర్టును చూస్తే మీకు కలిగే ఇబ్బంది ఏమిటి?.
- వేరే వారికి పుట్టిన పిల్లలకు మీరు పెట్టవద్దు.
- రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.
- అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు.
- రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదని ఎర్రం నాయుడు చెప్పారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..
- చంద్రబాబు వలనే పోర్ట్ పనులు జరుగుతున్నాయనడం టీడీపీ నేతల సిగ్గుచేటు.
- ఇలా మాట్లాడం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు దివాలకోరు రాజకీయానికి నిదర్శనం.
- పాదయాత్ర సందర్భంగా జగన్ పోర్ట్ నిర్మాణం గురించి హామీ ఇచ్చారు..
- అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..
- నేను పుట్టక ముందు నుంచి పోర్ట్ అంటూ చెపుతున్నారు..
- ఏ నాయకుడు నిర్మించ లేకపోయారు.
- వైఎస్ జగన్ వలన పోర్ట్ నిర్మాణం పూర్తి అయింది.
- శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చిన ఒక ప్రాజెక్ట్ గురించి బాబాయి అబ్బాయి చెప్పాలి..
- చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పాలి?.
శ్రీకాకుళం..
- ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..
- భావనపాడు పోర్టును నిర్మిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..
- ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా చంద్రబాబు చూశారు..
- దశాబ్దాల కలను వైఎస్ జగన్ నిజం చేశారు
- మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ నిర్మించారు
- చదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి..
- పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్..
- మూలపేట పోర్టు దశాబ్దల కల.
- ప్రజల కలను వైఎస్ జగన్ నిజం చేశారు..
- మూలపేట పోర్టు పనులను 70 శాతం పూర్తి చేశారు..
- 30% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది.
- వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని చెప్పి పోర్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు..
- ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్దన్న పాత్ర వైఎస్ జగన్ పోషించారు..
పోలీసుల ఆంక్షలు..
- మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ పోలీసుల ఆంక్షలు.
- నౌపాడ జంక్షన్ వద్ద సభకు మాత్రమే అనుమతి.
- వైఎస్సార్‌సీపీ నేతల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు.
- నౌపాడ జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారికేడ్లు ఏర్పాట్లు.
- మూలపేట పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం: ధర్మాన కృష్ణదాస్
- ఏడాది కాలంలోనే 70 శాతం పనులు పూర్తి చేశాం.
- కూటమి వచ్చిన తర్వాత 30 శాతం పనులను కూడా చేయలేకపోయింది.
- వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర.
విశాఖ:
- కురసాల కన్నబాబు కామెంట్స్...
- క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది..
- ఇప్పుడు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు..
- బాబు ఏనాడైనా ఒక్క పోర్టు నిర్మాణం చేశాడా?
- చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు..
- వైఎస్ జగన్‌కు పేరు రాకూడదని కుట్ర చేస్తున్నారు..
- ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మూలపేటకు వెళ్తున్నాం.
రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్..
- ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలని జగన్ సంకల్పించారు..
- వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు ఊపిరి పోశారు..
- ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ..
- మూలపేట పోర్టు కోసం పోరాటం చేస్తాం..
- అమరావతిపై పెట్టిన శ్రద్ద.. ఉత్తరాంధ్రపై ఎందుకు లేదు..
విశాఖ..
- ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..
- మూలపేట పోర్టు వైఎస్ జగన్ సంకల్పం..
- 70 శాతం పనులు మా హయాంలో చేసాం..
- 30 శాతం పనులు కూడా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు..
- వెనకబడిన శ్రీకాకుళం అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదు..
- ఎన్ని కుట్రలు చేసినా.. మూలపేట పోర్టు ఘనత జగన్నదే..
- మూలపేట పోర్టుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు..
- జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు..
ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..
నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..
విశాఖ నుంచి మూలపేటకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు.
మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ నేతలు మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు.
పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు..
నౌపాడ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారీకేడ్లు ఏర్పాటు..
మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు..
రోడ్డును టిప్పర్లతో బ్లాక్ చేసిన పోలీసులు.
మన మూలపేట పోర్టుకు పోదాం నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు..
ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్యక్రమం విజయవంతం చేస్తానంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు..
నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’
మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
👉రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు.
👉మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.
👉అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్‌సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్‌లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.


