Anju Now Fatima Receives Land Money Gift From Pak Businessman - Sakshi
Sakshi News home page

ఫాతిమాగా మారిన అంజు... పాకిస్తాన్ వ్యాపారవేత్త బహుమతులు 

Jul 30 2023 2:01 PM | Updated on Jul 30 2023 2:54 PM

Anju Now Fatima Receives Land Money Gift From Pak Businessman - Sakshi

ఇస్లామాబాద్: ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ప్రేమికుడు నస్రుల్లాను కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్ళిపోయినా భారత మహిళా అంజు అక్కడి సంప్రదాయాలను అలవాటు హెసుకునే క్రమంలో ఫాతిమాగా మారింది. దీంతో అక్కడి వ్యాపారవేత్త మహమ్మద్ ఖాన్ అబ్బాసీ ఆమెపై కానుకల వర్షాన్ని కురిపించారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలంతోపాటు నగదును కూడా కానుకగా ఇచ్చారు. 

రాజస్థాన్ కు చెందిన అంజు(34) పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా(29) ఒకరినొకరు సోషల్ మీడియాలో ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ప్రేమికుడిని కలుసుకునేందుకు అంజు సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ వెళ్లి కథను సుఖాంతం చేసుకుంది. ఒకపక్క ఆమె భర్త ఆమె వివాహం చెల్లదని చెబుతున్నా కూడా ఆమె మాత్రం తన సంప్రదాయాలను మార్చుకుని అక్కడ ఒదిగిపోయే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆమె అంజు నుండి ఫాతిమాగా మారింది. 

ఇదిలా ఉండగా ఆమె తెగువకు ఫిదా అయిపోయిన అక్కడి వ్యాపారవేత్త పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ ఖాన్ అబ్బాసీ ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి 272 చదరపు గజాల స్థలాన్ని, రూ.50000 నగదును కూడా కానుకగా ఇచ్చారు. ఈ సందర్బంగా అబ్బాసీ మాట్లాడుతూ.. కొత్త ప్రదేశానికి వచ్చినవారికి ఆశ్రయం ఏర్పరచుకోవడం కొంత కష్టంగానే ఉంటుంది. అందుకే నేను మా గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ తో చర్చించి ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని, నగదును ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. 

అబ్బాసీ అదేవిధంగా సహచర వ్యాపారవేత్తలు, ప్రభుత్వం కూడా వారికి చేయూతనివ్వాలని కోరారు. తమ దేశానికి కొత్తగా వచ్చిన ఫాతిమాకు పాకిస్తాన్ తన సొంత ఇల్లేనన్న భావన కల్పించాలని కోరారు.     

ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మాస్కో విమానాశ్రయం మూసివేత 

Advertisement
 
Advertisement
Advertisement