రష్యాపై డ్రోన్ల దాడికి పాల్పడ్డ ఉక్రెయిన్.. మాస్కో విమానాశ్రయం మూసివేత 

Moscow Airport Closed Briefly As Ukraine Drone Attacks - Sakshi

మాస్కో: ఆదివారం ఉదయం మాస్కో నగరంలో మొత్తం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి పాల్పడగా ఒకదాన్ని నగరం శివార్లలోనే కూల్చేశాయి రష్యా బాలగాలు. రెండిటిని మాత్రం ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ దెబ్బతీశాయి. ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు తగల్లేదని తెలిపింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ. దీంతో కొద్దిసేపు మాస్కో విమానాశ్రయాన్ని మూసివేశారు ఎయిర్పోర్టు అధికారులు. 

ఉక్రెయిన్ సరిహద్దు నుండి సుమారు 500 కి.మీ(310 మైళ్ళు) మేర ఆ దేశం అప్పుడప్పుడు దాడులకు పాల్పడింది. కానీ ఈసారి మాత్రం ఉక్రెయిన్ క్రెమ్లిన్, సరిహద్దులోని రష్యా పట్టణాల మీద దాడి చేసింది. మాస్కో నగర మేయర్ సెర్గీ సొబ్యానిన్ దాడులపై స్పందిస్తూ.. ఈ దాడుల్లో రెండు సిటీ ఆఫీస్ టవర్లు కొంత వరకు దెబ్బతిన్నాయని.. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. 

ఆదివారం జరిగిన డ్రోన్ల దాడుల్లో ఒకదాన్ని మాస్కో ఒడింట్సోవ్ జిల్లాలోని రక్షణ బలగాలు మట్టుబెట్టాయని మరో రెండు డ్రోన్లను తమ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ధ్వంసం చేసిందని.. వాటి శకలాలు నిర్మానుష్య ప్రాంతంలో నేలకూలాయని అన్నారు. ఈ కారణంగానే కొద్దిసేపు వ్నుకోవో విమానాశ్రయానికి రాకపోకలను నిలిపివేసినట్లు చెబుతూ దీన్ని మేము తీవ్రవాదుల చర్యగానే పరిగణిస్తున్నామని తెలిపింది రష్యా రక్షణ శాఖ.  

ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top