" ప్రెసిడెంట్ మీ పని మీరు చూసుకొండి " | Rajya Sabha MP Kamal Haasan Criticizes Trump Over India-Russia Oil Purchase Comments, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

" ప్రెసిడెంట్ మీ పని మీరు చూసుకొండి "

Mar 8 2026 12:02 PM | Updated on Mar 8 2026 1:56 PM

 Please Mind Your Business  Kamal Haasan slams Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై రాజ్యసభ ఎంపీ కమల్‌ హాసన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రెండు సౌర్వభౌమాధికారం ఉన్న దేశాలు అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవడమే ప్రపంచ శాంతికి పునాది రాయన్నారు.  అవతలి వారి విషయాల్లో తలదూర్చకుండా ట్రంప్ తన పని తాను చూసుకోవాలని హెచ్చరించారు.

ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇది వరకే భారత అంతరంగిక విషయాలు పలు మార్లు అమెరికా అధ్యక్షుడు బహిరంగ విమర్శలు చేశారు. వీటిని భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మార్చుకోలేదు. తాజాగా రష్యా నుంచి భారత్ నెల రోజుల పాటు  చమురు కోనుగోలు చేసుకోవచ్చని దానికి అనుమతిచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. ఈ వ్యాఖ్యల  పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.  

తాజాగా ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ కమల్‌ హాసన్‌ స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్రంప్‌కు లేఖ రాశారు. " ప్రియమైన ప్రెసిడెంట్  భారత ప్రజలు సౌర్వభౌమ దేశానికి చెందిన వారు. మాకు వేరే దేశాల అనుమతులు అవసరం లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పని చూసుకొండి" అన్నారు. సౌర్వభౌమ దేశాల అభిప్రాయాలకు పరస్పర గౌరవమివ్వడమే శాంతికి మూలమని మీ దేశ ప్రజలకు  శాంతి, సౌభాగ్యం లభించాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

అంతకు మందు స్కాట్ బెసెంట్ " ఇండియన్స్ మంచి యాక్టర్స్, వారికి మేము రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని కోరాం. వారు అలానే చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా ఆజ్ఞలకు తాత్కాలిక విరమింపు ఇచ్చాం. వారికి చమురు కొనుగోలుకు అనుమతి ఇచ్చాం" అని అన్నారు. దీంతో బీసెంట్‌ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement