ట్రంప్ నిన్ను వదలం.. ఖమేనీ సన్నిహితుడి వార్నింగ్ | Iran Security Chief Vows Retaliation Over Khamenei Killing And Holds Trump Accountable, More Details Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్ నిన్ను వదలం.. ఖమేనీ సన్నిహితుడి వార్నింగ్

Mar 8 2026 1:30 PM | Updated on Mar 8 2026 4:15 PM

Wont Leave Trump Alone  Iran Top Official Warning

ఇరాన్‌ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఖమేనీ హత్యపై  ఇరాన్ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ సుప్రీం హత్యకు ట్రంప్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.

ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మృతి చెందారు. దీంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతీకారేచ్చతో రగిలిపోయి ఏక కాలంలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతుంది. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ ఈ అంశంపై స్పందించారు.  ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

"మేము మా నాయకుడి రక్తానికి మా ప్రజల మృతికి నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాలి. చెల్లిస్తాడు కూడా మేము ఆయనను ఒంటరిగా వదిలిపెట్టం, అతను మా నాయకున్ని చంపడంతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాడు. ఇది మాములు విషయం కాదు " అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్‌ను విడగొట్టే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.

వెనెజువెలా మాదిరి ఇరాన్‌లో కూడా ప్రభుత్వాన్ని  కూలదోయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్‌లోని పరిస్థితిని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని లారిజానీ అన్నారు.  గల్ఫ్ దేశాలు వారి దేశంలో నుంచి తమపై దాడి చేయకుండా నియంత్రించాలని లేని పక్షంలో ప్రతి దాడి చేయడం తప్పదన్నారు.

లారిజానీ ఖమేనీకి సన్నిహితుడు ఇతను గతంలో IRGCలో పనిచేశారు. ఇతని సోదరుడు సాదిక్ లారిజానీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ పోటీదారులలో ఒకరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement